నిదురించే క్షణాన
ఒక లాలి పాట తట్టీ లేపితే బాగుండునేమొ
ఎందుకంటే ఘర్జించే విప్లవగీతాలు
వినేతనం ఇక చచ్చిపొయిందేమొ...
లేచి ఆ వెన్నెలే
పగలనుకుంటే బాగుండునేమొ
ఎందుకంటె ఇక ఆ సూర్యుడు
ఉదయించడానికే సిగ్గు పడెనేమొ...
అక్షరాలు బోర్డుమీద...
నాట్యమాడక ఈతనేర్చుకుంటే బాగుండునేమొ,
ఎందుకంటే ఆలోచనలు ఇక..
మందు బాటిళ్ళలో మునిగితేలే సమయమేమొ...
తరం తరం అంటూ
వెనక్కి నడిస్తే బాగుండునేమొ,
ఎందుకంటే ఇక ముందు తరం...
సిగ్గుపడటానికే భయపడే రోజులేమొ...
- కె . కె.
(english- for people who can't read telugu lipi)
nidurinche kshanana
oka laali paata tatti lepute bagundunemoendukante gharjinche viplavageethalu
viney thanam ika chachipoyindemo..
lechi aa venneley
pagalanukunte bagundunemo
endukante eka aa suryudu
udayinchataanikey siggu padeynemo
aksharaalu boardumeeda...
natyamaadaka eethanerchukunte bagundunemo,
endukante aalochanalu ika..
mandu botillalo munigitelesamayamemo.
tharam tharam antu
venakki nadistey bagundunemo,
endukante inka mundu tharam...
siggupatataanikey bayapade rojulemo...
- k.k.
will be more than happy if someone translates it in english